హెపటైటిస్ బి
గురించి మరింతగా
తెలుసుకోండి

హెపటైటిస్ అంటే ఏమిటి?

‘హెపటైటిస్’ అనేది కాలేయంలో వాపుకు కారణమవుతుంది. కాలేయం అనేది పోషకాలను ప్రోత్సహించే అవయవం, అలానే రక్తాన్ని వడబోత చేయడం, అంటువ్యాధులు సోకకుండా రక్షణ కల్పించడం వంటి పనులు చేస్తుంది. కాలేయం వాచినప్పుడు లేదా పాడైనప్పుడు, దాని పనితీరుపై ప్రభావం పడుతుంది.1 ఎక్కువగా మద్యం సేవించడం, విషపదార్ధాలు, కొన్నిరకాల మందులు మరియు కొన్ని వైద్య పరిస్థితులు హెపటైటిస్‌కు కారణం కావొచ్చు. అయితే, హెపటైటిస్ చాలా తరుచుగా వైరస్ వల్ల వస్తుంది.1

హెపటైటిస్ బి అంటే ఏమిటి?

హెపటైటిస్ తీవ్రమైన కాలేయ వ్యాధికా కారణం కావొచ్చు అలానే షార్ట్ హెచ్‌బివి అనే హెపటైటిస్ బి వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్ కలుగుతుంది.1

అక్యూట్ హెపటైటిస్ బి అనేది స్వల్పకాలిక ఇన్‌ఫెక్షన్, ఇది ఒక వ్యక్తి ఆ వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురైన 6 నెలలలోపు బయటపడుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ వలన కొంత జ్వరం రావచ్చు లేదా రాకపోవచ్చు. అలానే ఆరోగ్యం బాగా దెబ్బతిని, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు వస్తాయి.1

దీర్ఘకాలిక హెపటైటిస్ బి అనేది జీవితకాల ఇన్‌ఫెక్షన్. 90% మంది శిశువులు హెపటైటిస్ బి వైరస్‌కు గురవుతున్నారు. దీని వలన వారిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్ కలుగుతుంది. అదే సమయంలో, 5 % మంది పెద్దల్లో దీర్ఘకాలిక హెపటైటిస్ బి వృద్ధి చెందుతుంది. కాలానుగుణంగా, దీర్ఘకాలిక హెపటైటిస్ బి వలన కాలేయం పాడవడం, కాలేయ వ్యాధి, కాలేయ క్యాన్సర్ అలానే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావడంతోపాటుగా మరణానికి కూడా దారితీయవచ్చు.1

భారతదేశంలో హెపటైటిస్ బి ఇన్‌ఫెక్షన్ ఎంత సాధారణమైనది?

అంతర్జాతీయంగా, సుమారు 240 మిలియన్ మంది వ్యక్తులకు హెపటైటిస్ బి వైరస్ (హెచ్‌బివి) సోకింది భారతదేశంలో దాదాపుగా 3.0% శాతంగా ఉంది. అత్యాధిక స్థాయిలో అది మనుషుల్లో ఉంది. 1.25 బిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉండటంతో, భారతదేశంలో 37 మిలియన్‌ల హెచ్‌బివి క్యారియర్ సోకిన వారు ఉన్నారు, అలానే ఈ హెచ్‌బివి భారం భారీ సంఖ్యలో ఉంది.2

హెపటైటిస్ బి రావడానికి గల కారణాలు ఏమిటి?

హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్‌కు కారణం అవుతుంది. హెపటైటిస్ బి సోకిన వ్యక్తి రక్తం, వీర్యం లేదా ఇతర శరీర ద్రవాలతో సంపర్కం ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది ఇలా వ్యాప్తి చెందవచ్చు.3

 • హెపటైటిస్ బి తల్లి నుండి బిడ్డకు సోకవచ్చు
 • వైరస్ సోకిన వ్యక్తితో ఎలాంటి రక్షణ లేకుండా లైంగిక చర్యలో పాల్గొనడం వలన సోకవచ్చు
 • వైరస్ సోకిన వ్యక్తితో సూదులు లేదా ఇతర మందులను పంచుకోవడం వలన సోకవచ్చు
 • వైరస్ సోకిన వ్యక్తికి ఉపయోగించిన సూదులను అనుకోకుండా ఉపయోగించడం వలన సోకవచ్చు.
 • వ్యాధి సోకిన వ్యక్తికి టాబూలు, పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించిన వాటిని స్టెరిలైజ్ చేయకుండా లేదా అన్ని వైరస్‌లు మరియు ఇతర సూక్ష్మజీవులను శుభ్రం చేయకుండా ఇతరులకు ఉపయోగించడం వలన సోకవచ్చు.
 • వ్యాధి సోకిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించుకోవడం లేదా పచ్చిగా ఉన్న పుళ్ల ద్వారా సోకవచ్చు.
 • వ్యాధి సోకిన వ్యక్తి రేజర్, టూత్‌బ్రష్ లేదా నెయిల్ క్లిప్పర్‌లను ఉపయోగించడం ద్వారా సోకవచ్చు.

హెపటైటిస్ బి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఏమిటి?

వైరస్ శరీరంలోనికి వచ్చిన తరువాత 1.5 నుంచి 6 నెలలు (సగటున 4 నెలలు) పాటు పొదిగే కాలం ఉంటుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. అక్యూట్ దశలో (ఇన్‌ఫెక్షన్ అయిన మొదటి 6 నెలలు) చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు లేదా కొద్దిగా జ్వరం రావచ్చు. అక్యూట్ హెచ్‌బివి ఇన్‌ఫెక్షన్ అయినప్పుడు, ఈ లక్షణాలు ఉండవచ్చు.4,5

హెపటైటిస్ బికి చికిత్స ఏమిటి?

ఈ అక్యూట్ హెపటైటిస్ బి కలిగిన వారికోసం, డాక్టర్‌లు సాధారణంగా విశ్రాంతి, తగిన పోషణ, ద్రవాలు తీసుకోమని అలానే వైద్య పర్యవేక్షణను సిఫారసు చేస్తారు. కొంతమంది ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. దీర్ఘకాలిక హెపటైటిస్ బి ఉన్న వ్యక్తులు కాలేయ సమస్యలకు సంబంధించి తప్పక పరీక్షలు చేయించుకోవాలి. అలానే రోజూ డాక్టర్‌ల పర్యవేక్షణలో ఉండాలి. కాలేయ వ్యాధుల ప్రభావం తగ్గించగల లేదా నివారించగల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.1

హెపటైటిస్ బి ఇన్‌ఫెక్షన్‌తో ఎవరికి ప్రమాదం ఉంటుంది?3,4

 • మత్తుమందులు వాడే వినియోగదారులు
 • హీమో డయాలిస్ రోగులు
 • రక్తంలో సంబంధం ఉన్న ఆరోగ్య సంరక్షణ మరియు ప్రజా భద్రత కార్మికులు
 • హెచ్‌బివి సోకిన భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొన్నవారు
 • మగవారితో లైంగిక చర్యలో పాల్గొనే మగవారు
 • ఒకే ఇంట్లో ఉండే హెచ్‌బివి సోకిన వ్యక్తులు
 • సాధారణంగా హెపటైటిస్ బి ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రదేశాలకు వెళ్లే ప్రయాణీకులు, అక్కడ వారితో దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నవారు

నాకు హెపటైటిస్ బి సోకిందని నేను ఎలా తెలుసుకోగలను?

డాక్టర్‌లు మీ వైద్య మరియు కుటుంబ చరిత్ర, భౌతిక పరీక్ష మరియు రక్తపరీక్షల ఆధారంగా హెపటైటిస్ బి ని నిర్ధారణ చేస్తారు, మీకు హెపటైటిస్ బి ఉంటే మీ కాలేయం, కాలేయజీవాణు పరీక్షలో తాత్కాలికంగా ఎస్టాజియోగ్రఫీ, ప్రత్యేక ఆల్ట్రాసౌండ్ వంటివాటిని ఉపయోగించి మీ కాలేయాన్ని పరీక్షించడానికి మీ డాక్టర్ అదనపు పరీక్షలు చేయవచ్చు.3

హెపటైటిస్ బిని నిరోధించవచ్చా?

అవును, హెపటైటిస్ బి నిరోధించడానికి ఉత్తమ మార్గం టీకాను తీసుకోవడం. సాధారణంగా హెపటైటిస్ బి టీకాను 3 నెలల వ్యవధిలో ౩ సార్లు ఇస్తారు. దీర్ఘకాల రక్షణ కోసం మొత్తం మూడుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది.1

మీ అంతట మీరే పరీక్షించుకోండి

దయచేసి గమనించండి: మిమ్మల్ని గైడ్ చేయడంలో మీ డాక్టరే అత్యుత్తమ వ్యక్తి, ఈ కరపత్రంలో ఉన్న సమాచారం మీ వైద్యుడు అందించిన వైద్య సలహాలకు ప్రత్యామ్నాయం కాదు, మీకు మీ వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఎప్పుడూ డాక్టర్‌ని లేదా అర్హత కలిగిన ఆరోగ్య ప్రదాతను సంప్రదించండి.

అస్వీకార ప్రకటన:

ఇక్కడ ప్రచురితమైన కంటెంట్ పూర్తిగా హెపటైటిస్ కు సంబంధించిన సమాచారం మరియు పరిజ్ఞానం పెంపొందించడం కొరకు మాత్రమే ఉద్దేశించబడింది. ఏదైనా తృతీయపక్షానికి ఏదైనా రిఫరెన్స్ మరియు/లేదా లింక్ మైలాన్ ద్వారా ఎండార్స్ చేయబడదు లేదా వారెంటీని కలిగి ఉండదు. ఇందులో ఉన్న సమాచారం ఖచ్చితమైనది మరియు తాజాగా ఉందని ధృవీకరించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మైలాన్ ఎలాంటి ప్రాతినిధ్యం వహించదు లేదా దీనిలో వివరించిన కంటెంట్ ద్వారా వ్యాప్తి చేసిన ఏదైనా సమాచార కచ్చితత్త్వానికి ఎలాంటి బాధ్యత వహించదు, దీనిలో ఇచ్చిన ఏదైనా సమాచారం ఉపయోగించడం వల్ల కలిగే ఏదైనా దోషం, మినహాయింపు మరియు పర్యవసానాలకు బాధ్యత వహించదు మరియు దీని నుంచి ఉత్పన్నమయ్యే ఏవైనా బాధ్యతలను స్పష్టంగా అస్వీకారం చేస్తుంది.

హెపటైటిస్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. మీకు మార్గదర్శనం చేయడానికి మీ వైద్యుడు అత్యుత్తమ వ్యక్తి. అందించబడ్డ సమాచారం మీ వైద్యుడి ద్వారా అందించే వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు

References:

 1. 1. CDC Hepatitis B – General Informations. Available from https://www.cdc.gov/hepatitis/hbv/pdfs/HepBGeneralFactSheet.pdf. Accessed on 25th July 2018.
 2. 2. Pankaj Puri et al. Tackling the Hepatitis B Disease Burden in India. J Clin Exp Hepatol. 2014 Dec; 4(4):312–319.Published online 2014 Dec 15. doi: 10.1016/.j.jceh.2014.12.004.
 3. 3. U.S. Department of health and Human services. SAN FRANCISCO DEPARTMENT OF PUBLIC HEALTH.DISEASE PREVENTION & CONTROL. Available from https://www.sfcdcp.org/infectious-diseases-a-to-z/d-to-k/hepatitis-b/. Accessed on 25th July 2018.
 4. 4. POPULATION HEALTH DIVISION. SAN FRANCISCO DEPARTMENT OF PUBLIC HEALTH.DISEASE PREVENTION & CONTROL. Available from https://sfcdcp.org/infectious-diseases-a-to-z/d-to-k/hepatitis-b/. Accessed on 25th July 2018.
 5. 5. Web.stanford.edu. (2018). Hep B Patient Ed. [online] Available at: http://web.stanford.edu/group/virus/hepadna/2004tansilvis/Patient%20Ed.htm. [Accessed 16 Aug. 2018]