హెపటైటిస్ సి
గురించి మరింతగా
తెలుసుకోండి

నేను బాగానే ఉన్నాను
పరీక్ష చేసుకోండి మరియు
నివారణ పొందండి

హెపటైటిస్ సికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు అయితే చికిత్స ఉంది.1

హెపపటైస్ సి వల్ల కాలేయం దెబ్బతింటుంది మరియు కాలేయ క్యాన్సర్ వస్తుంది.2

చికిత్స ద్వారా హెపటైటిస్ సి వైరస్‌ని నిర్మూలించవచ్చు.3

కాలేయం ప్రాముఖ్యత4

కాలేయం మీ అత్యంత పెద్ద అంతర్గత అవయవం మరియు మంచి ఆరోగ్యానికి ఇది కీలకం. కాలేయం దిగువ పేర్కొన్నవాటితో సహా 500 పనులు చేస్తుంది:

  • బైలు ఉత్పత్తి, ఇది జీర్ణక్రియ సమయంలో కొవ్వులను విఘటనం చేస్తుంది.
  • కొలెస్ట్రాల్ మరియు ప్రత్యేక ప్రోటీన్‌ల ఉత్పత్తి చేస్తుంది, కొవ్వులు శరీరం అంతటా ప్రయాణించడానికి దోహదపడతాయి.
  • రక్త ప్లాస్మా కొరకు నిర్ధిష్ట ప్రోటీన్‌లను ఉత్పత్తి చేస్తుంది
  • అధికంగా ఉండే గ్లూకోజ్‌ని గ్లైకోగాన్‌ (శక్తిని నిల్వ చేయడం)గా మారుస్తుంది
  • గ్లూకోజ్ మరియ అమైనోఆమ్లాలు యొక్క రక్త స్థాయిల్ని నియంత్రిస్తుంది
  • వివిధ రకాల ఔషధాలు మరియు హానికరమైన పదార్ధాల నుంచి రక్తాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది.
  • హెమోగ్లోబిన్‌ని ప్రాసెస్ చేస్తుంది మరియు ఐరన్‌ని నిల్వ చేస్తుంది.
  • అనేకరకాలైన గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తం గడ్డకట్టేందుకు దోహదపడుతుంది
  • నిర్ధిష్ట మొత్తంలో రోగనిరోధక కారకాలను ఉత్పత్తి చేయడం ద్వారా అంటువ్యాధులకు విరుద్దంగా పోరాడటానికి మరియు రక్త ప్రవాహం నుంచి బాక్టీరియాని తొలగించడానికి దోహదపడుతుంది

హెపటైటిస్ అంటే ఏమిటి?

‘‘హెపటైటిస్’’ అంటే కాలేయం యొక్క వాపు. ఎక్కువగా మద్యం తీసుకోవడం, విషతుల్యాలు, కొన్ని ఔషధాలు మరియు నిర్ధిష్ట ఔషధ పరిస్థితుల వల్ల హెపటైటిస్ వస్తుంది. అయితే, హెపటైటిస్ అత్యంత సాధారణంగా వైరస్ వల్ల వస్తుంది2

హెపటైటిస్ సి అంటే ఏమిటి?

హెపటైటిస్ సి వైరస్, క్లుప్తంగా హెచ్‌సివి అని అంటారు. హెచ్‌సివి కాలేయానికి సోకవచ్చు మరియు ఫలితంగా హెపటైటిస్ రావొచ్చు. ఎవరైనా సోకిన తరువాత మొదటి 6 నెలలకు తీవ్రమైన హెపటైటిస్ క్రెఫర్‌లు ఉంటాయి.2 ఈ సమయంలో తీవ్రమైన హెచ్‌సివితో ఉన్న వారిలో సుమారు 25% మంది పూర్తిగా కోలుకుంటారు.5 తీవ్రమైన అంటువ్యాధి చాలా స్వల్ప అస్వస్థతతో కొన్ని లేదా ఎలాంటి రోగలక్షణాలు లేకుండా ఉండటం నుంచి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమైన తీవ్రమైన పరిస్థితి వరకు ఉండవచ్చు.2
తీవ్రమైన హెచ్‌సివితో ఉన్న 75% మంది వ్యక్తులకు దీర్ఘకాలిక లేదా క్రానిక్ హెచ్‌సివి ఉంటుంది. ఔషధాలతో విజయవంతంగా చికిత్స చేయనట్లయితే, క్రానిక్ హెచ్‌సివి కాలేయం సిర్హోసిస్, కాలేయ క్యాన్సర్ మరియు కాలేయం విఫలం కావడానికి దారితీస్తుంది

భారతదేశంలో హెపటైటిస్ సి ఎంత సాధారణం?

భారతదేశంలో ప్రతి 100 మందిలో ఒక వ్యక్తి‌కి హెచ్‌సివి సోకవచ్చు. 2014వ సంవత్సరంలో సుమారు 2,88,000 కొత్త హెచ్‌సివి కేసులు కనుగొనబడినట్లుగా అంచనా. భారతదేశంలో హెచ్‌సివికి సంబంధించి ప్రతిఏడాది 96,000 మరణాలు సంభవిస్తున్నాయి.6-8

మీ కాలేయంలో ఎటువంటి హెచ్‌సివి ఉంటుంది?

హెచ్‌సివి అస్వస్థత వల్ల కలిగే వ్యాధి

ఆరోగ్యవంతమైన కాలేయం

ఆరోగ్యవంతమైన పాడైపోయినప్పటికీ కాలేయం తిరిగి పెరుగుతుంది, లేదా తిరిగి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది మీ రక్తాన్ని వడపోస్తుంది, పోషకాలను ప్రాసెస్ చేస్తుంది మరియు అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడుతుంది.2,9

ఫైబ్రినోసిస్

కాలేయ వ్యాధిలో, కాలేయ వాపు ఒక మచ్చతో ప్రారంభం అవుతుంది. ఈ మచ్చ కణజాలం పెరిగి, ఆరోగ్యవంతమైన కాలేయ కణజాలాన్ని భర్తీ చేస్తుంది. ఈ ప్రక్రియను ఫైబ్రోసిస్ అని అంటారు. ఈ దశలో, మీ కాలేయం ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్నట్లుగా పనిచేయకపోవచ్చు.9

సిర్రోసిస్

సిర్హోసిస్ అనేది కాలేయం యొక్క మచ్చ, ఇందులో గట్టి మచ్చ కణజాలం మృదు ఆరోగ్యవంతమైన కణజాలాన్ని భర్తీ చేస్తుంది. ఒకవేళ ఈ దశలో కార్సినోమాకు చికిత్స చేయనట్లయితే, ఇది సరిగ్గా పనిచేయదు మరియు కాలేయ వైఫల్యాన్ని దారితీయవచ్చు.9

కార్సినోమా

హెపాటోఆక్యులర్ కార్సినోమా (హెచ్‌సిసి) లేదా లివర్ క్యాన్సర్ అత్యంత సాధారణ రకం ప్రాథమిక లివర్ క్యాన్సర్. కాలేయంలో ప్రారంభమయ్యే క్యాన్సర్‌ని ప్రాథమిక లివర్ క్యాన్సర్ అని అంటారు. ఇది కాలేయంలో అనారోగ్యకరమైన కణాలను అభివృద్ధి చేస్తుంది మరియు వ్యాప్తి చెందిస్తుంది.10

ఎవరికి హైపటైటిస్ సి వచ్చే ప్రమాదం ఉంది?

వ్యాధి సోకిన వ్యక్తి నుంచి రక్తం మీ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు మీకు హెపటైటిస్ సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఇది మీకు రావొచ్చు:

వ్యాధి సోకిన వ్యక్తి సూదులను పంచుకోవడం2,11-13

2001 కంటే ముందు రక్తమార్పిడి చేయించుకోవడం, అంటే హెపటైటిస్ సి లేదా ఇతర అంటువ్యాధుల కొరకు మామూలుగా రక్తం పరీక్షించబడని1,2,11-13

మీరు హెపటైటిస్ సి ఉన్న తల్లికి పుట్టినవారు కావడం( తల్లి నుంచి బిడ్డకు సంప్రదించేందుకు 5% అవకాశం ఉంది.1,2,11-13

అంటువ్యాధి సోకిన వ్యక్తిపై ఉపయోగించి టూల్స్ ప్రమాదవశాత్తు గుచ్చుకోవడం.1,2,11-13

అంటువ్యాధి సోకిన వ్యక్తిపై ఉపయోగించి సూది మీకు ప్రమాదవశాత్తు గుచ్చుకోవడం.1,2,11-13

అంటువ్యాధి సోకిన వ్యక్తి రేజర్ లేదా టూత్‌బ్రష్‌ని ఉపయోగించడం.1,2,11

హీమోడయాలసిస్ చేయించుకోవడం.2,12

మీరు ఎప్పుడైనా జైలులో పనిచేయడం లేదా ఉండటం.2,12

అరుదుగా, హెపటైటిస్ సి లైంగికంగా సంక్రమించవచ్చు.1,2,11-13

సాధారణ ఆహార సలహా

మీ ఆహారంలో వీటిని కలిగి ఉన్న రోజువారీ మరియు సంతులిత ఆహారాన్ని చేర్చాలి14

  • సంపూర్ణ గింజల బ్రెడ్ మరియు పప్పుధాన్యాలు
  • మాంసం, చేపలు, గింజలు, గుడ్లు మరియు డైరీ ప్రొడక్ట్‌లు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం.
  • చాలా పండ్లు మరియు కూరగాయలు
  • పెద్ద మొత్తంలో నీరు ( రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసులు)

వీటిని ఉపయోగించడం పరిమితం చేయండి లేదా పరిహరించండి:

  • ఆహారంలో ఎక్కువగా ఉప్పు, చక్కెర మరియు కొవ్వులు
  • మద్యం తాగడం

హెపటైటిస్ సి ఏవిధంగా వ్యాప్తి చెందదు?

అంటువ్యాధి ఉన్న వ్యక్తితో చేతులు కలపడం1,15-16

తల్లిపాలు, ఆహారం లేదా నీటి ద్వారా1,15

దగ్గడం మరియు తుమ్మడం1-16

స్విమింగ్ పూల్స్ మరియు సోనాస్‌లు పంచుకోవడం1,161-16

కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం మరియు ఆలింగనం చేసుకోవడం1-16

ఒకే పాత్రలు లేదా గాజు సామాగ్రిని పంచుకోవడం, ఒకే గ్లాసునుంచి తాగడం1-16

బాత్‌రూమ్‌లు పంచుకోవడం1-16

దుస్తులు పంచుకోవడం1-16

నాకు హెచ్‌సివి ఉందని నాకు ఎలా తెలుస్తుంది?

మీకు హెచ్‌సివి ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఏకైక మార్గం పరీక్ష నిర్వహించడమే. రెండు రకాల పరీక్షల ద్వారా వైద్యులు హెచ్‌సివి నిర్ధారణ చేస్తారు2,11

  • a. ప్రతిరోధకాల కొరకు రక్తాన్ని తనిఖీ చేసే పరీక్ష- రోగనిరోధక వ్యవస్థ ద్వారా తయారు చేయబడ్డ ప్రోటీన్‌లు వైరస్‌కు ప్రతిస్పందిస్తాయి.2,11<.sup>
  • b. వైరస్ ద్వారా తయారు చేయబడే ఆర్ఎన్ఎ అనే పదార్ధం కొరకు పరీక్షలు చేయబడతాయి.2-11

నెగిటివ్ యాంటీబాడీ టెస్ట్ ఉండే చాలామంది వ్యక్తులకు హెచ్‌సివి సంక్రామ్యత ఉండదు మరియు వారికి అదనపు టెస్టింగ్ అవసరం లేదు.11

అస్వీకారం:

ఇక్కడ ప్రచురితమైన కంటెంట్ పూర్తిగా హెపటైటిస్ కు సంబంధించిన సమాచారం మరియు పరిజ్ఞానం పెంపొందించడం కొరకు మాత్రమే ఉద్దేశించబడింది. ఏదైనా తృతీయపక్షానికి ఏదైనా రిఫరెన్స్ మరియు/లేదా లింక్ మైలాన్ ద్వారా ఎండార్స్ చేయబడదు లేదా వారెంటీని కలిగి ఉండదు. ఇందులో ఉన్న సమాచారం ఖచ్చితమైనది మరియు తాజాగా ఉందని ధృవీకరించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మైలాన్ ఎలాంటి ప్రాతినిధ్యం వహించదు లేదా దీనిలో వివరించిన కంటెంట్ ద్వారా వ్యాప్తి చేసిన ఏదైనా సమాచార కచ్చితత్త్వానికి ఎలాంటి బాధ్యత వహించదు, దీనిలో ఇచ్చిన ఏదైనా సమాచారం ఉపయోగించడం వల్ల కలిగే ఏదైనా దోషం, మినహాయింపు మరియు పర్యవసానాలకు బాధ్యత వహించదు మరియు దీని నుంచి ఉత్పన్నమయ్యే ఏవైనా బాధ్యతలను స్పష్టంగా అస్వీకారం చేస్తుంది.

హెపటైటిస్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. మీకు మార్గదర్శనం చేయడానికి మీ వైద్యుడు అత్యుత్తమ వ్యక్తి. అందించబడ్డ సమాచారం మీ వైద్యుడి ద్వారా అందించే వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు

References:

  1. 1. NHS Hepatitis C Symptoms. Available from: http://www.nhs.uk/Conditions/Hepatitis-C/Pages/Symptoms aspx. Accessed on 22nd February 2015.
  2. 2. CDC, Hepatitis C General information. Available from: http://www.cdc.gov/hepatitis/HCV/PDFs/HepCZGeneralFactSheet.pdf. Accessed on 22nd March 2015.
  3. 3. Treatment of Hepatitis C Up to date. Available at https://www.uptodate.com/contents/hepatitis-c-beyond-thebasics#H17555986. Accessed on 17th Dec 2018.
  4. 4. Health library. Liver Anatomy and Functions. Johns Hopkins Medicine. Available at https://www.hopkingmedicine.org/healthbrary/conditions/liverbillary_and_pancreatic_disorders/liver_anatomy_and_functions_85,P00676. Accessed on 26th Dec. 2018.
  5. 5. Behzad Hajarizadeh, Jason Grebely. Gregory J. Dore. Epideminology and natural history of HCV infection. Nat Rev Gastroentrola Hepatol 2013;10(9):553-62.
  6. 6. Puri P. Anand AC, Saraswat VA, Acharya SK, Dhiman RK, Aggrawal R. et. at. Consensus Statement of HCV Task Force of the Indian National Association for Study of the Liver (NASL). Part I: Status Report of HCV infection in India. J Clin Exp. Hepatol 2014;4(2):106-116.
  7. 7. Dhiman RK. Future of therapy for Hepatitis C in India. A matter of Accessibility and Affordibility ? J Clin Exp Hepatol 2014:4(2) 85-6.
  8. 8. Amirthalingam R and Pavalakodi VN. Prevalence of HIV 1, HCV and HBV infections among inhabitants in Chennai City at Hi-tech Center, Tamil-Nadu-India Medical Science 2013;3(8)24-28.
  9. 9. The progression of Liver Disease. American Liver Foundation. Available at https://liverfoundation.org./forpatients/about the-river/the-progression-of-river-disease/#1503432164252-f19f7e9c-0374. Accessed on 20th Dec 2018.
  10. 10. Liver Cancer American Liver Foundation. Available at https://liverfoundation.org/for/patients/about-the-river/disease-of the liver/liver-cancer/ Accessed on 20th Dec 2018.
  11. 11. Chopra S. Patient education: Hepatitis C (Beyond the Basics) Up To Date. Available from http://www.uptodate.com/contents/hepatitis-c-beyond-the basics. Accessed on 22nd March 2015.
  12. 12. NIH. What I need to know about Hepatitis C. Available from http://www.niddk.nih.gov/health/information/health - topics/liver-disease/hepatitis-c-Pages/ez.aspx. Accessed on 22nd March 2014.
  13. 13. CDC Hepatitis C Information for the Public. Available from : http://www.cdc.gov/hepatitis/c/cfaq.htm.
  14. 14. Viral Hepatitis, Diet and Nutrition: Entire Lesson. United States Department of Veterans Affairs. Available at https://www.hepatitis.va.gov/patient/daily/diet/single-page.asp. Accessed on 26th Dec 2018.
  15. 15. Hepatitis C. Key Facts World Health Organization, Retrieved from https://www.who.int/news-room/factsheets/detail/hepatitis-c. Accessed on 11th Dec 2018.
  16. 16. How hepatitis C is not transmitted. Hepatitis C: Transmission and prevention. infohep. Available at http://www.infohep.org/How-hepatitis-C-is-not-transmitted/page/2620968. Accessed on 11th Dec. 2018.